: తెలంగాణ యాసపై అవగాహన లేకనే సినిమాల్లో వ్యంగ్యం: తనికెళ్ల భరణి


తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారని రచయిత, నటుడు తనికెళ్ల భరణి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ కోపం లేదని తెలిపారు. గతంలో తాను ఓ హీరోయిన్ ను పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడిస్తూ, 'మొండిమొగుడు-పెంకిపెళ్లాం' చిత్రాన్ని నిర్మించామని గుర్తు చేశారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పూర్వీకులది తనికెళ్ల గ్రామం అయివుండవచ్చని, అంతకుమించి తనికెళ్ల తన ఇంటి పేరు ఎలా అయిందో తెలియదని అన్నారు. తనకు భవిష్యత్తులో పద్మశ్రీ అవార్డు వచ్చినా, దాన్ని స్వీకరించబోనని స్పష్టం చేశారు. తెలుగు పరిశ్రమలో ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులకు దక్కని పద్మశ్రీ సత్కారం, తనకూ వద్దని, ఒకవేళ వచ్చినా తిరస్కరిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News