: యూపీ సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది: రాజ్ నాథ్


వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పి యూపీ సీఎం అభ్యర్థిని తానేనంటూ వస్తున్న వార్తలకు తెరదించారు. ఇప్పటి వరకైతే ఈ విషయంపై పార్లమెంటరీ బోర్డులో చర్చకు రాలేదని చెప్పారు. సమయం రాగానే బోర్డు ఆ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లీడ్ రోల్ తీసుకోవాలని పలువురు బీజేపీ నేతలు రాజ్ నాథ్ ను కోరిన విషయం తెలిసిందే. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించిన అస్సాం ఎన్నికల్లో బీజేపీ అధికారం సొంతం చేసుకోగా, ప్రకటించని బీహార్ లో ఓటమి పాలైన విషయంపై రాజ్ నాథ్ స్పందిస్తూ సీఎం అభ్యర్థులను ముందుగా ప్రకటించకుండానే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News