: ముద్రగడ భార్య పద్మావతికి శ్వాస సమస్యలు... : వియ్యంకుడు సోమేశ్వరరావు


గత 12 రోజులుగా భర్త ముద్రగడ పద్మనాభంతో కలసి ఆమరణ దీక్ష చేస్తున్న పద్మావతికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్టు ముద్రగడ వియ్యంకుడు సోమేశ్వరరావు వెల్లడించారు. ఆమె పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, ముద్రగడ బీపీలో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని, తక్షణం వీరిద్దరికీ మెరుగైన చికిత్సలు అవసరమని పేర్కొన్నారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై నేటి మధ్యాహ్నం వైద్యులు ఓ బులెటిన్ ను విడుదల చేయనున్నారు. కాగా, తుని రైలు ఘటన కేసులో అరెస్టయిన 13 మందినీ విడుదల చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని ముద్రగడ భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారిలో ప్రస్తుతం 8 మంది మాత్రమే విడుదల కాగా, మరో ముగ్గురి బెయిల్ పై నేడు విచారణ జరగనుంది. మరో ఇద్దరికి బెయిల్ లభించినా, సాంకేతిక కారణాలతో విడుదల కాలేదు.

  • Loading...

More Telugu News