: ఆటో డ్రైవర్ గా పల్లె!... ఫొటోగ్రాఫర్ గా గంటా!


ఏపీ కేబినెట్ మంత్రులు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న మంత్రులు ప్రజలతో మమేకమవుతున్న క్రమంలో మంత్రి హోదాను పక్కనపెట్టేసి వినూత్న రీతుల్లో ఫొటోలకు పోజులిస్తున్నారు. నిన్నటికి నిన్న రైతు బిడ్డగా అడ్డ పంచె కట్టి పొలంలో గొర్రు పట్టి విత్తనమేసిన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అచ్చమైన రైతు బిడ్డలాగే కనిపించారు. తాజాగా ఆయన ఆటో డ్రైవర్ అవతారమెత్తారు. నిన్న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పర్యటించిన సందర్భంగా ఆటో డ్రైవర్లతో మాట కలిపిన మంత్రి... వారిలో ఓ వ్యక్తి ఆటో తీసుకుని డ్రైవర్ సీటులో కూర్చున్నారు. ఆటోను స్టార్ట్ చేసి కొంత దూరం నడిపారు. ఇక విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రి గంటా శ్రీనివాసరావు... నిన్న ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. నిన్న విశాఖలో జరిగిన ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల వర్క్ షాపునకు హాజరైన సందర్భంగా కెమెరా చేతబట్టి, దానితో ఫొటోలు తీస్తూ ఆయన సందడి చేశారు.

  • Loading...

More Telugu News