: నాపై నమ్మకమే... మా నాన్న నాకిచ్చిన గొప్ప బహుమతి!: ట్విట్టర్ లో వైఎస్ జగన్
నిన్న ‘ఫాదర్స్ డే’ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ‘ఫాదర్స్ డే గ్రీటింగ్స్’ను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘నా జీవితంలోని ప్రతి ప్రయాణంలో ఎల్లప్పుడూ మా నాన్నే నిజమైన గొంతుక. నాపై ఆయన ఉంచిన నమ్మకమే... ఆయన నాకు ఇచ్చిన గొప్ప బహుమతి’’అని జగన్ ట్వీట్ చేశారు.