: అన్ని వేళలా, అన్ని చోట్లా అండగా నిలిచారు... థ్యాంక్యూ డాడ్!: తండ్రికి నారా లోకేశ్ ’ఫాదర్స్ డే’ గ్రీటింగ్స్!
‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా తండ్రి నారా చంద్రబాబునాయుడికి గ్రీటింగ్స్ చెప్పారు. ‘‘అన్ని వేళలా, అన్ని చోట్లా అండగా నిలిచారు... థ్యాంక్యూ డాడ్’’ అంటూ తండ్రి చంద్రబాబుకు కృతజ్ఞతలతో కూడిన శుభాకాంక్షలు చెప్పారు. ఇక తనయుడు దేవాన్ష్ గురించి కూడా ఈ సందర్భంగా తన మనసులోని భావాలను లోకేశ్ వెలిబుచ్చారు. ‘నీ నవ్వే నా ప్రపంచాన్ని గొప్పగా మారుస్తోంది’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘నవ్వుతున్న దేవాన్ష్ ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ నవ్వుతోనే మేము ఫాదర్స్ డే సంబరాలు జరుపుకున్నాం’’ అని ఆయన ట్వీటారు. ఇక తన పట్ల తండ్రి వైఖరిని ఆసక్తికరంగా ప్రస్తావించిన లోకేశ్ ‘‘నాపై మా నాన్న చూపిన ప్రేమ విలువ నేను తండ్రిని అయ్యాక గుర్తించాను. ఆయన ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అన్ని వేళలా, అన్ని చోట్లా నాకు అండగా నిలిచేవారు’’ అంటూ పేర్కొన్నారు.