: పాపం, పిచ్చోళ్లు.. నన్ను హీరోగా పెట్టుకుంటున్నారనుకున్నా!: హీరో నాని


‘అష్టాచెమ్మా సినిమాకు నేనే హీరో అని దర్శకుడు, మరికొందరు డిసైడ్ అయినప్పుడు వాళ్ల మీద నాకు చాలా జాలేసింది. పాపం, పిచ్చోళ్లు.. నన్ను పెట్టి సినిమా తీస్తున్నారనుకునేవాడిని’ అని హీరో నాని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో తన బలమేంటో గ్రహించానని, ఈరోజు తానెక్కడికి వెళ్లినా ఒక హీరోగా కన్నా ‘మనోడు నాని’ అనే భావనతో చూస్తున్నారని, అదెంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ఒక సినిమాలో చేస్తే ఎవరైనా సరే హీరో అనిపించుకోవచ్చు, సక్సెస్ అయితే స్టార్లు కావచ్చు కానీ, మనోడు అనిపించుకోవడం కష్టమని నాని అభిప్రాయపడ్డాడు. ఏదైనా సరే, మెట్టు మెట్టు ఎదిగితేనే, అందంగా ఉంటుందని, దానికి ఒక విలువ ఉంటుందని అన్నాడు. మొదటి చిత్రంలోనే స్టార్ అయి కూర్చుంటే, కిందకు దిగడం తప్పితే ఇంకేముండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. గమ్యం కాదు, గమనం ముఖ్యమని నాని అన్నాడు.

  • Loading...

More Telugu News