: ఒక ప్రేక్షకుడి యాంగిల్ లో కథ విని సెలక్టు చేసుకుంటాను: హీరో నాని


ఒక ప్రేక్షకుడి యాంగిల్ లో కథ విని, అది నచ్చి, ఎంజాయ్ చేస్తే ఆ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తానని హీరో నాని చెప్పాడు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘హీరో యాంగిల్ ఉందా.. నా క్యారెక్టర్ బాగుందా... మంచి పంచ్ డైలాగ్ లు ఉన్నాయా? అనే అంశాలను ఎప్పుడూ ఆలోచించను. ఆ కథను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తాను. కొత్తదనాన్ని ఆదరించే ప్రేక్షకులు ఉన్నప్పుడు... ఎంకరేజింగ్ కంటెంట్ పుడుతుంది. మంచి సినిమాలు వస్తున్నాయంటే దానికి కారణం ఇండస్ట్రీ కాదు ప్రేక్షకులు’ అని నాని అన్నాడు.

  • Loading...

More Telugu News