: స్పీకర్ పదవికి ఫిట్ కాననే సందేహం ఉండేది: కోడెల
మంత్రి పదవి వస్తుందనుకున్నానని, కానీ, స్పీకర్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదని, ఆ పదవికి ఫిట్ కాననే సందేహం ఉండేదని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గతంలో హోం మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా మైక్ తీసుకుని స్టేజ్ పై మాట్లాడాలంటే తనకు భయంగా ఉండేదన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును అడిగానని, అదేసమయంలో, వీలుకానిపక్షంలో ఆ పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదని కూడా చెప్పానని... స్పీకర్ పదవి ఇవ్వాలని అనుకున్నానని చంద్రబాబు ఆ తర్వాత నాకు చెప్పారని, అదే పదవిని స్వీకరించాను’ అని నాటి విషయాలను కోడెల ప్రస్తావించారు. స్పీకర్ అయ్యాక తన భావోద్వేగాలను చంపేశానని, తానేమీ టీడీపీ ఏజెంట్ గా వ్యవహరించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆరోపణలు లేని స్పీకరే లేరని, ప్రతిపక్షానికే ఎక్కువ అవకాశం ఇస్తున్నానని, పదవిని దుర్వినియోగం చేయనని కోడెల అన్నారు.