: 1 నుంచి ‘చంద్రన్న రంజాన్ తోఫా’ అమలు
జులై 1 నుంచి 'చంద్రన్న రంజాన్ తోఫా' పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గుంటూరులోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మందికి ‘రంజాన్ తోఫా’ సరుకులు పంపిణీ చేస్తామన్నారు. సాంకేతిక విధానాలతో పౌరసరఫరాల శాఖలో అవినీతికి చెక్ పెట్టామన్నారు. జనాభాకు తగ్గట్లుగా డీలర్లను పెంచే యోచనలో ఉన్నామని, సబ్ కమిటీ నిర్ణయం తర్వాత డీలర్ల కమిషన్ పెంపు ఉంటుందని వెల్లడించారు. సర్వే తర్వాత కొత్త కార్డులు మంజూరు చేస్తామని సునీత తెలిపారు.