: గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలైన శ్రీలంక క్రికెటర్
ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ లో మరో రెండు రోజుల్లో తొలి వన్డే ప్రారంభం కానున్న తరుణంలో శ్రీలంక పేసర్ షమింద ఎరంగా ఆసుపత్రి పాలయ్యాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎరంగాను ఇంగ్లాండ్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చినట్లు శ్రీలంక వర్గాలు తెలిపాయి. కాగా, చెస్టర్ లీలో జరిగిన రెండో టెస్టులో ఎరంగా వివాదాస్పద శైలి కారణంగా రేపు లాబరౌ విశ్వవిద్యాలయంలో జరిగే బౌలింగ్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. కాగా, టెస్టుల్లో ఇప్పటికే దమ్మిక ప్రసాద్, దుష్మంత చమీరాలు దూరమైన విషయం తెలిసిందే.