: రైలు బండిని లాక్కెళ్లిన కారు!
రైలు పెట్టెలను లాక్కెళ్లే ఇంజన్ కు బదులు కారును ఉంచి.. వినూత్నరీతిలో ప్రచార ప్రకటనను (అడ్వేర్ టైజ్మెంట్) రూపొందించింది ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్స్ సంస్థ. 100 టన్నుల బరువు గల రైలు పెట్టెలను లాగేందుకు ల్యాండ్ రోవర్ కారును ఇంజన్ గా ఉపయోగించింది. ఈ రైలును 10 కిలోమీటర్ల వరకు ల్యాండ్ రోవర్ కారు లాక్కుపోయింది. ఈ యాడ్ ను స్విట్జర్లాండ్ లోని రైనీ నదిపై 85 అడుగుల ఎత్తులో ఉన్న రైల్వే బ్రిడ్జిపై చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.