: జడ్జిల భోజనాలకు వెండిపాత్రలు...ఆక్షేపణలు


రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్ లో సుప్రీంకోర్టు జడ్జిల నాలుగో సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు జడ్జిలతో పాటు వారి భార్యలు కూడా పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సహా సుమారు 240 మంది హాజరయ్యారు. వీరిని ప్రభుత్వ అతిథులుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా వారి భోజనాల కోసం ఏకంగా వెండి పాత్రలను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు రూ.3.57 లక్షలు, ఆహార పదార్థాల కోసం రూ.3.37 లక్షలు ఖర్చు చేసింది. అంతే కాకుండా అతిథులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా అజయ్ దూబే అనే వ్యక్తి సేకరించాడు. అతిథులకిచ్చేందుకని వెండి పాత్రలను ప్రత్యేకంగా కొనుగోలు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News