: ఫాదర్స్ డే.... సినీ ప్రముఖుల జ్ఞాపకాలు
ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నామంటే దానికి కారణం తమ తండ్రే నంటూ పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ హీరోలు అక్కినేని నాగార్జున, రవితేజ, నటుడు ఉత్తేజ్, శివబాలాజీ, శ్రీనివాస్ అవసరాల, ‘నాన్నకు ప్రేమతో’ దర్శకుడు సుకుమార్, మాటల రచయిత కోన వెంకట్ తదితరులు ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తమ తండ్రి గురించి ఎవరేమన్నారంటే... * ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన నా తండ్రి శ్రీపతి పండితారాద్యుల సాంబమూర్తి గారికి, సంగీత పరంగా నాకు సహాయం చేసిన అందరు తండ్రులకు పితృదినోత్సవ శుభాకాంక్షలు. మనకు ప్రతిరోజు తల్లిదండ్రుల దినోత్సవమే- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం * అందరు నాన్నలకు హ్యాపీ ఫాదర్స్ డే- అక్కినేని నాగార్జున * నా అన్నది ఈలోకంలో ఏదన్నా ఉంటే అది నా ‘నాన్నే’- కోన వెంకట్ * ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో పాటను తండ్రులందరికీ డెడికేట్ చేస్తున్నాను- దర్శకుడు సుకుమార్