: అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో వాస్తవాల అధ్యయనం పేరిట వైఎస్సార్సీపీ నేతలు అమరావతిలో చేపట్టిన పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.