: ముద్రగడకు హై బీపీ, ఆయన భార్య పద్మావతికి లో బీపీ: చాలా నీరసంగా ఉన్నారన్న వైద్యులు
గడచిన 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య పద్మావతి చాలా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు, ఆయన 140/90 హై బీపీతో, పద్మావతి 100/70 లో బీపీతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని గంటగంటకూ పరిశీలిస్తున్నామని, ప్రతి రెండు గంటలకూ ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తున్నామని తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఫ్లూయిడ్స్ ను ఎక్కిస్తున్నామని, ఇతర స్పెషలిస్టు వైద్యుల సలహాలను తీసుకుంటున్నామని వివరించారు.