: తండ్రి నుంచి దూరంగా బతుకుతున్న అమెరికన్లెందరో... ఒబామా ఆవేదన
ఎంతో మంది అమెరికన్ చిన్నారులు తండ్రి ఆలనా పాలనకు దూరమై బతుకుతున్నారని, ఇందుకు అటు పిల్లలది, ఇటు పెద్దలదీ, ఇద్దరి తప్పూ ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఆయన స్పందిస్తూ, బాధ్యతను గుర్తెరిగిన కొందరు తండ్రులు మాత్రమే పిల్లల సంరక్షణపై శ్రద్ధ కనబరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులైన తండ్రులకు చేయూతనిస్తూ, వారి ఫ్యామిలీలకి సపోర్ట్ ఇచ్చేలా కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులుగా పిల్లల సంరక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వారికి మరింత సాయపడతామని హామీ ఇచ్చారు. తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దే మార్గంలో తండ్రుల పాత్రే కీలకమని ఒబామా అన్నారు.