: రూ. 10 లక్షలను కాజేసిన దొంగలను 12 గంటల్లో పట్టుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు
నిన్న సాయంత్రం కలకలం రేపిన సుల్తాన్ బజార్ దారి దోపిడీ కేసును పోలీసులు 12 గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ. 10.70 లక్షలను రికవరీ చేసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిన్న రాత్రి టైర్ల వ్యాపారి దినేష్ పై దాడి చేసి ఆయన వద్ద ఉన్న క్యాష్ బ్యాగును దొంగలు లాక్కెళ్లారు. దినేష్ సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లన్నింటినీ పరిశీలించిన అధికారులు, దోపిడీ దొంగలు పాత నేరస్తులేనని గుర్తించి, వెంటనే వారి ఆచూకీ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. దోపిడీ జరిగిన 12 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాన్ని అధికారులు అభినందించారు. నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నామని, రేపు రిమాండ్ చేస్తామని పోలీసులు తెలిపారు.