: గాలి జనార్దన్ రెడ్డితో వికాస్ కు ఎప్పుడైనా ముప్పే... ఆనాడే హెచ్చరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ


బళ్లారి ప్రాంతంలో అక్రమ గనుల తవ్వకాలకు తెరలేపి వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్న గాలి జనార్దనరెడ్డి వర్గీయులతో వికాస్ భన్సాడేకు ఎప్పటికైనా ముప్పేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గతంలోనే కేంద్రానికి లేఖను రాశారు. వికాస్ కర్ణాటక రాష్ట్ర లోకాయుక్తకు న్యాయ సలహాదారుగా ఉన్న సమయంలోనే బళ్లారి గనుల అక్రమ తవ్వకాల విషయం వెలుగులోకి రాగా, గాలి అరెస్టై జైలుకు వెల్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా కేసును విచారిస్తున్న లక్ష్మీనారాయణ స్వయంగా కేంద్రానికి లేఖను రాస్తూ, వికాస్ కు భద్రతను పెంచాలని, గాలి అనుచరులు ఆయన్ను హత్య చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అప్పట్లో ఆయన హెచ్చరికల ఆధారంగా, జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించిన హోం శాఖ, ఆపై దాన్ని వెనక్కు తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరుగగా, నిందితులు ఎవరన్నది మాత్రం తేలలేదు. ఇప్పుడు తాజాగా ఆయన్ను హత్య చేయాలని మందుపాతరను పెట్టగా, అదృష్టవశాత్తూ దాని వైర్లు భూమిపైకి తేలి కనిపించడంతో ఆయన మరోమారు తప్పించుకోగలిగారు.

  • Loading...

More Telugu News