: పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి రూ. 5 లక్షల నగలు నొక్కేసిన బాల నేరస్తుడు!


తన పుట్టిన రోజు సందర్భంగా ఓ వజ్రాల నక్లెస్, ఇతర ఆభరణాలు పెట్టుకున్న ఐదవ తరగతి విద్యార్థిని అందంగా ముస్తాబై స్కూలుకు రాగా, మాయమాటలు చెప్పిన ఓ కుర్రాడు, వాటిని దోచుకుపోయాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. ఈ ఉదయం ఆభరణాలతో ఉన్న సౌమ్య ప్రణవిని, ఆమె తండ్రి స్వయంగా స్కూలు వద్ద దింపి వెళ్లాడు. పాప స్కూల్ లోకి వెళుతుండగా, లాగు, చొక్కాతో ఉన్న ఓ బాలుడు వెనుకే వచ్చాడు. ఆభరణాలు ఉంటే ప్రిన్సిపాల్ తరగతి గదిలోకి రానీయరని, అవి తీసి తనకిస్తే, వాటిని జాగ్రత్తగా ప్రిన్సిపాల్ వద్ద ఉంచుతానని మాయమాటలు చెప్పాడు. వీటిని నమ్మిన ఆ బాలిక నగలన్నీ తిసి వాడికి ఇవ్వగా, ప్రిన్సిపాల్ రూములోకి వెళుతున్నట్టు నటించి, బయటకు చెక్కేశాడు. దుండగుడి ప్రతి కదలికా స్కూల్ లోని సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తం కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆ బాలుడి వయసు 14 నుంచి 15 ఏళ్ల వరకూ ఉండవచ్చని, సీసీటీవీలో రూపం స్పష్టంగా కనిపిస్తుండటంతో, సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని వివరించారు.

  • Loading...

More Telugu News