: తిరుమలలో హరీశ్ రావు... మొక్కు చెల్లించుకున్న తెలంగాణ మంత్రులు
తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న తన సతీమణి శ్రీనితతో కలిసి అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకున్న హరీష్ రావుకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం వారు దర్శనానికి రాగా, ఆలయ సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, స్వామి పాదాల వద్ద ఉంచిన పట్టు వస్త్రాలను మంత్రులకు బహూకరించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు అందించారు.