: రాహుల్ గాంధీకి మోదీ ఆశీర్వాద ట్వీట్!
నేడు తన 46వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాద్వారా ఆయన్ను ఆశీర్వదిస్తూ, "కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు పూర్తి ఆరోగ్యం, దీర్ఘాయుష్షును భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ పుట్టినరోజు వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లోని పీసీసీల ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతుండగా, కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. పలు చోట్ల నేతలు కేక్ కట్ చేసి ఉత్సాహంగా రాహుల్ జన్మదిన వేడుకలు జరిపి, ఆయనకు అభినందనలు తెలిపారు.