: సైకిలెక్కి ప్రజల వద్దకు మంత్రి కొల్లు రవీంద్ర!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఉదయం ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సైకిలెక్కి ప్రజల వద్దకు బయలుదేరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను సైకిల్ యాత్రను చేపట్టానని వెల్లడించిన ఆయన, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, సాగుతున్నారు. రవీంద్రతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలూ ర్యాలీగా సాగుతుండగా, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు వినతి పత్రాలను మంత్రికి అందిస్తున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మచిలీపట్నం ప్రాంతంలో నెలకొన్న అన్ని సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. డ్రైనేజీ, రహదార్ల మరమ్మతులు వెంటనే చేపట్టనున్నామని వివరించారు.