: అమరావతి ఉద్యోగుల సూపర్ ఫాస్ట్ రైలు సమయాలివి!


హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా విజయవాడ - హైదరాబాద్ మధ్య ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. దీన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ఉద్యోగుల రాకపోకలకు ఈ రైలు అనుకూలంగా ఉండనుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు, రైలు నెంబర్ 12795 పేరిట రోజూ సాయంత్రం 5:30 గంటలకు విజయవాడలో బయలుదేరి 6:20కి గుంటూరు చేరి, అక్కడి నుంచి నాన్ స్టాప్ గా రాత్రి 11:10కి సికింద్రాబాద్ వస్తుంది. ఇదే రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:30కి బయలుదేరి గుంటూరుకు 10:08కి, ఆపై 11 గంటలకు విజయవాడకు చేరుతుంది. మొత్తం 14 బోగీల్లో 10 సీటింగ్, రెండు ఏసీ చైర్ కార్, రెండు ఎస్ఎల్ఆర్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News