: మమతా కులకర్ణి కనుసన్నల్లో వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం... కెన్యా నుంచి రప్పించేందుకు చర్యలు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి కీలక సభ్యురాలని, వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని ఆమె చేస్తోందని మహారాష్ట్రలోని థానే పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ వెల్లడించారు. ఇటీవల రూ. 2 వేల కోట్ల విలువైన ఎఫిడ్రిన్ ను తరలిస్తున్న నిందితులను పట్టుకుని విచారించగా, మరోసారి మమతా కులకర్ణి పేరు బయటకు వచ్చిందని ఆయన తెలిపారు. ఆమె కనుసన్నల్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని, అమెరికన్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి కూడా మమతా ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు అందాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కెన్యాలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం ముంబైకి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.