: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం... గంజాయి వ్యాపారంలోకి ప్రవేశం
గంజాయి వాడకం అక్రమమంటూనే, గంజాయి తోటల పెంపకాన్ని మాత్రం చట్టబద్ధం చేసిన అమెరికాలో, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గంజాయి వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్టు ప్రకటించింది. గంజాయి మార్కెటింగ్ కోసం అవసరమైన సాఫ్ట్ వేర్ ను అందిస్తామని తెలిపింది. ఇందుకోసం 'మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజనెస్' పేరిట కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించామని, గంజాయి వ్యాపారాన్ని చట్టబద్ధం చేసిన రాష్ట్రాల్లో ఆన్ లైన్ విధానంలో పంటను అమ్ముకోవచ్చని తెలిపింది. కాగా, అమెరికాలో గంజాయి పంటలను పండిస్తున్నప్పటికీ, సరైన మార్కెటింగ్ మాత్రం కరవైంది. కంపెనీలను ఆకర్షించడంలో విఫలమవుతున్న గంజాయి పెంపకందారులకు సాయపడేందుకే తామీ వ్యాపారంలోకి అడుగు పెట్టామని మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. రైతులు తమ పంటను విక్రయించేందుకు మధ్యవర్తిగా ఉండి, మార్కెటింగ్ అవకాశాలను దగ్గర చేస్తామని వివరించింది.