: టీ20ల్లో బుమ్రా సరికొత్త రికార్డు!
జింబాబ్వేతో హరారేలో జరిగిన టీ20 మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో టీ20ల్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. ఇంకా క్యాలెండర్ ఇయర్ కు చాలా సమయం ఉండడానికి తోడు టీమిండియా మరిన్ని సిరీస్ లు ఆడనున్న నేపథ్యంలో బుమ్రా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. దీంతో టీ20ల్లో బుమ్రా మరో కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం కూడా ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.