: అమరావతి రైతులకు సోమవారం నుంచి ప్లాట్ల పంపిణీ!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ అధికారులు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20 నుంచి అధికారులు ప్లాట్లు కేటాయిస్తారు. రాజధానికి భూములిచ్చేందుకు ముందుగా ముందుకు వచ్చిన నేలపాడు గ్రామ ప్రజల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, ఈ ప్లాట్లను లాటరీ పధ్ధతిలో కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు నేలపాడులోని సీఆర్డీయే కార్యాలయానికి భూములిచ్చిన రైతులు చేరుకోవాలని వారు సూచించారు.