: మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని హత్య చేసేందుకు పథకం వేసిన బురిడీ బాబా... విచారణలో వెల్లడి
లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని 1.33 కోట్ల రూపాయలకు బురిడీ కొట్టించిన నకిలీబాబా శివ, పోలీసు విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడని తెలిపారు. మధుసూదన్ రెడ్డి స్నేహితుడు మోహన్ రెడ్డి ద్వారా శివ అతనికి పరిచయమయ్యాడని వారు తెలిపారు. కోటిన్నర రూపాయలను తన మహిమతో పది కోట్ల రూపాయలుగా మారుస్తానని మధుసూదన్ రెడ్డిని శివ నమ్మించాడు. దీంతో వారు ఈ డబ్బు తెచ్చి శివ ముందు పూజలకు పెట్టినట్టు తెలుస్తోంది. వారి నుంచి డబ్బు కాజేసిన అనంతరం వారిని హత్య చేసేందుకు పథకం రచించాడు. వారి నుంచి కొట్టేసిన 1.33 కోట్ల రూపాయలతో బెంగళూరు శివార్లలో ఓ విల్లా కొనుక్కుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే వ్యూహం బెడిసికొట్టి శివ బురిడీ కొట్టించిన 24 గంటల్లోపు దొరికిపోవడం విశేషం. కాగా, రైస్ పుల్లింగ్, మనీ డబ్లింగ్ (రెట్టింపు) పేరిట పలువురిని మోసం చేసినట్టు కూడా శివ అంగీకరించాడు.