: తిరుమల వెళ్లిన తెలంగాణ మంత్రి హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కనిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం హరీష్ రావు తొలిసారి ఏపీలో అడుగుపెట్టారు. హరీష్ రావు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు. హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హరీష్ రావు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అలిపిరి నుంచి ఆయన కాలి నడకన తిరుమల బయల్దేరారు. బంగారు తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని ఆయన వెంకటేశ్వర స్వామిని కోరుకోనున్నారు. అలాగే తెలంగాణ సిద్ధించిన సందర్భంగా గతంలో మొక్కుకున్న మొక్కులు చెల్లించుకోనున్నారు.