: తెలంగాణలో పరిపాలన వాస్తు ప్రకారం నడుస్తోంది: పారికర్ ఎద్దేవా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తును బాగా నమ్ముతారని ఆయన సన్నిహితులు పేర్కొంటారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాదులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో పరిపాలన వాస్తు ప్రకారం సాగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. రెండేళ్లలో మోదీ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని పారికర్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.