: ఐదుగురు టీమిండియన్ల టీ20 అరంగేట్రం...టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే!
హరారే వేదికగా ఆతిథ్య జింబ్వాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడిన జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభించింది. వన్డేల్లో పేలవంగా ఆడిన జింబాబ్వే ఆటగాళ్లు టీ20లో ఆకట్టుకునేలా ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాగా, ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి ఐదుగురు భారతీయ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న కేెఎల్ రాహుల్, చాహల్, రిషి ధావన్, మన్ దీప్ సింగ్, ఉనద్కత్ లు తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్నారు. కాగా, నాలుగు ఓవర్ల పాటు ఆకట్టుకునేలా ఆడిన జింబాబ్వే ఆటగాడు మసకద్జా (25) ఆ తర్వాత బుమ్రా వేసిన ఆఫ్ కట్టర్ ను ధోనీకి క్యాచ్ ఇచ్చి వైదొలిగాడు. దీంతో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఒక వికెట్ నష్టానికి 4.3 ఓవర్లలో జింబాబ్వే 33 పరుగులు చేసింది.