: నాసా సరికొత్త ఆవిష్కరణ... బ్యాటరీతో నడిచే విమానం!


అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బ్యాటరీతో నడిచే విమానాన్ని రూపొందిస్తోంది. దీనికి ‘ఎక్స్‌-57’ అనే పేరుతో పాటు, ‘మ్యాక్స్‌ వెల్‌’ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. తక్కువ ఇంధనంతో, తక్కువ ధరకే లభించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దీనిని రూపొందించనున్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. తక్కువ శబ్దంతో, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తయారు చేయనున్నట్టు నాసా పేర్కొంది. 14 ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ తో కొత్త ప్రొపల్షన్‌ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా నాసా ఈ విమానాన్ని తయారుచేయనున్నట్టు చెబుతోంది. 19వ శతాబ్దంలో ఎలక్ట్రో మ్యాగ్నటిజమ్‌ రంగంలో విశేషమైన పరిశోధనలు చేసిన స్కాటిష్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ క్లర్క్‌ మాక్స్‌ వెల్‌ పేరిట దీనిని తయారు చేయనున్నామని, అందుకే దీనికి ‘మ్యాక్స్‌ వెల్‌’ అని పేరు పెట్టామని నాసా తెలిపింది.

  • Loading...

More Telugu News