: బురిడీ బాబాకు 14 రోజుల రిమాండ్...చంచల్ గూడ జైలుకు తరలింపు
'లైఫ్ స్టైల్' బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని 1.33 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి బెంగళూరుకు పారిపోయి, ఒక్కరోజు కూడా తిరక్కుండానే పట్టుబడ్డ శివ అలియాస్ శివానందబాబాను హైదరాబాదు పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతనిని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు.