: సమీక్షా సమయం!... టీ టీడీపీ నేతలతో నారా లోకేశ్ కీలక భేటీ


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరింత క్రియాశీలంగా మారారు. ప్రతి శనివారం టీ టీడీపీ నేతలతో భేటీ అవుతానని గత వారం ఇచ్చిన హామీ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ ముఖ్యులతో భేటీ అయ్యారు. టీ టీడీపీ చీఫ్ ఎల్. రమణ, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతం, అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి ఎదురొడ్డి పోరాడే విషయాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News