: బురిడీ బాబాకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు... మరికాసేపట్లో కోర్టుకు


సినీ ఫక్కీలో హైదరాబాదు 'లైఫ్ స్టయిల్' బిల్డింగ్ యజమాని మధుసూదన రెడ్డికి టోకరా ఇచ్చి రూ.1.33 కోట్లతో ఉడాయించిన బురిడీ బాబా శివానంద మరికాసేపట్లో శ్రీకృష్ణ జన్మస్థానంలోకి అడుగుపెట్టనున్నారు. మధుసూదన రెడ్డికి టోకరా వేసి చాకచక్యంగా మాయమైన శివానందను 24 గంటలు తిరక్కముందే పట్టేసిన పోలీసులు అతడిని నిన్ననే హైదరాబాదుకు తీసుకువచ్చారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం అతడి చేతివాటాన్ని బయటకు లాగిన పోలీసులు అతడిని మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో నిబంధనల మేరకు అతడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అతడిని కోర్టులో హాజరుపరుస్తారు.

  • Loading...

More Telugu News