: 225 మందిని ఆహ్వానిస్తే ... హాజరైంది 25 మందే!: పౌష్టికాహార సదస్సుపై ఏపీ ప్రజా ప్రతినిధుల ఆనాసక్తి
ఐక్యరాజ్యసమితి కీలక విభాగం యూనిసెఫ్, ఏపీ అసెంబ్లీ, శాసనమండలి, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న విజయవాడలోని గేట్ వే హోటల్ లో పిల్లల పౌష్టికాహారంపై ఓ కీలక సదస్సు జరిగింది. భావి భారత పౌరుల సంక్షేమంపై జరగనున్న ఈ కీలక సదస్సుకు శాసనసభ, మండలి సభ్యులంతా (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) హాజరుకావాలని ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఈ సదస్సుకు హాజరయ్యే విషయంపై మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఆసక్తి చూపలేదు. ఏపీ శాసనసభ, మండలిలో మొత్తం 225 మంది సభ్యులుండగా, వారిలో కేవలం 25 మంది మాత్రమే ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న ఈ సదస్సు వెలవెలబోయింది.