: పిల్లలే మన ఆస్తులు!... తగ్గుతున్న జనాభాపై చంద్రబాబు మరోమారు ఆందోళన!
ఏపీలో జనాభా క్రమంగా తగ్గుతున్న వైనంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... పరిమిత సంఖ్యలో పిల్లలను కనాలనే దంపతులతో పాటు అసలు పిల్లలే వద్దనుకునే దంపతులు తమ వైఖరి మార్చుకోవాలని పిలుపునిచ్చారు. నిన్న విజయవాడలో పౌష్టికాహారంపై యూనిసెఫ్ ఏర్పాటు చేసిన సభలోనూ చంద్రబాబు మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘రాష్ట్రంలో జనాభా తగ్గుతోంది. ప్రతి ఒక్కరూ సంతానం కలిగి ఉండాలి. డబ్బున్న కుటుంబాల్లో ఒక్క బిడ్డతో సరిపెట్టుకుంటున్నారు. అసలు పిల్లలే వద్దని మరి కొందరు అనుకుంటున్నారు. కానీ పిల్లలే మన ఆస్తులు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల స్థిరంగా ఉంది. ఇది తిరోగమనంలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఆయన పిలుపునిచ్చారు.