: బ్రిటన్ ఓటూ భారత్ కే!... మోదీకి స్పష్టం చేసిన కామెరాన్!


అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలకు మరింత మద్దతు లభించింది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా సహా మెజారిటీ దేశాలు ఎన్ఎస్జీ లో భారత్ కు సభ్యత్వం ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. చైనా, టర్కీ తదితర కొన్ని దేశాలు మాత్రమే భారత్ కు సభ్యత్వమిచ్చేందుకు వ్యతిరేకత చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కు ఫోన్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ మద్దతు కోరారు. మోదీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కామెరాన్... తమ సంపూర్థ మద్దతు భారత్ కే నంటూ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో జరగనున్న ఎన్ఎస్జీ భేటీలో భారత్ కు సభ్యత్వం దక్కే విషయంలో మరింత బలం పెరిగిందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News