: ఏమయ్యా! గౌతమ్ మీనన్...నీకిది న్యాయమా?: నాగార్జున


ఏమయ్యా, నీకిది న్యాయమా? అంటూ నాగార్జున 'సాహసం శ్వాసగా సాగిపో' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రశ్నించారు. ఈ సినిమా ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతూ, 'సార్, మీతో చేస్తా'నని గౌతమ్ తనకు ఎప్పుడూ చెబుతుంటాడని, కానీ ఇప్పటి వరకూ అది నిజం కాలేదని అన్నారు. 'సార్, మీకు మంచి విలన్ పాత్ర ఉంది' అని చెబుతుంటాడు, ఇప్పటి వరకు ఆ పాత్ర ఇవ్వనేలేదని, అలా చెప్పేసి వెళ్లిపోతాడని నిష్టూరమాడారు. అలాగే రెహమాన్ ను కూడా నాగార్జున వదలలేదు. 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న తనతో ఒకేఒక్క సినిమా చేసి, చైతన్యతో మాత్రం రెండు సినిమాలు చేస్తారా? అని అన్నారు. మీతో పని చేయడం ఎవరికైనా ఆనందమేనని నాగార్జున అన్నారు. రెహమాన్ పాటలన్నీ వింటుంటానని ఆయన చెప్పారు. సినిమా యూనిట్ కు ఆయన అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News