: కాపులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయద్దు!: మంత్రులకు దాసరి సూచన
కాపు రిజర్వేషన్ ఉద్యమ ఐక్యవేదిక నేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. కాకినాడలో పల్లంరాజు నివాసంలో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముద్రగడ కోడలి ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. వాస్తవాలు గమనించకుండా కాపులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆయన మంత్రులకు సూచించారు. ముద్రగడ స్వప్రయోజనాల కోసం దీక్ష చేపట్టలేదన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. అనంతరం ఆయన పల్లంరాజు నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు. భేటీ ఇంకా కొనసాగుతోంది.