: తల్లిని రప్పించుకున్నారు...భార్యను పిలిపించుకోరేం?: మోదీని ప్రశ్నించిన అజాంఖాన్


ప్రధాని నరేంద్ర మోదీపై ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో ఆయన మాట్లాడుతూ, కట్టుకున్న భార్యకు గుర్తింపునివ్వని వ్యక్తికి సమాజంలో ఆడపిలల్ల గురించి మాట్లాడే హక్కు ఎలా వస్తుందని అన్నారు. తల్లిని ఇంటికి రప్పించుకుని ఆతిథ్యమిచ్చిన మోదీ, భార్యను కూడా ఇంటికి రప్పించుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. మైనారిటీలను పాకిస్థాన్ పంపించేస్తామని మాటల్లో చెప్పే మోదీ, ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్ వెళ్తారని ఆయన ఎద్దేవా చేశారు. కైరానాలో హిందూ కుటుంబాల వలసల్లో బీజేపీ పాత్ర ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ గుజరాత్ తరహా అల్లర్లను కోరుకుంటోందని, పశ్చిమ యూపీలో ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో అల్లర్లకు కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News