: కూల్చే సంస్కృతి నాది కాదు: భట్టి విక్రమార్క ఫైర్
తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పిందని, ఇప్పుడు ఆ విషయం ఏమైందని నిజామాబాద్ ఎంపీ కవిత ఈరోజు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌పై త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. తాను ప్రభుత్వాన్ని కూల్చుతానని ఎప్పుడూ అనలేదని ఆయన పేర్కొన్నారు. ‘కూల్చే సంస్కృతి నాది కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏదో ముసలం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దళారులు, దోపిడీ దారులు, గుత్తే దారులు కలసి దోచుకునేందుకే టీఆర్ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.