: పెళ్లికి నిరాకరించాడని పాకిస్థాన్‌లో పురుషుడిపై యాసిడ్ గుమ్మరించిన మహిళ
పాకిస్థాన్‌లో మహిళలపై దాడులు చేయడం సాధారణమైపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మహిళ పురుషుడిపై దాడి చేసింది. అక్కడి ముల్తాన్‌కు చెందిన మొనిల్ మాయ్ (32) అనే మహిళ తన పొరుగింట్లో నివసించే రషీద్ అనే వ్యక్తిపై యాసిడ్ దాడి చేసింది. తనను పెళ్లి చేసుకోవాలని రషీద్‌ను ఆమె కోరింది. అయితే పెళ్లికి అతను ఒప్పుకోకపోవడంతో మొనిల్ మాయ్ ఆగ్రహం తెచ్చుకుంది. దీంతో నిన్న రషీద్‌పై యాసిడ్ గుమ్మరించి కోపాన్ని తీర్చుకుంది. మొనిల్ మాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.