: ఏకంగా రూ. 54 వేలు తగ్గిన నిస్సాన్ మైక్రా ధర


జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న వాహన తయారీ సంస్థ నిస్సాన్, తామందిస్తున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కారు మైక్రా ధరను భారత మార్కెట్లో రూ. 54,252 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఆటోమేటిక్ ఎక్స్ ఎల్ వేరియంట్ ధర ఇప్పటివరకూ రూ. 6,53,252 ఉండగా, ఇప్పుడది రూ. 5,99,000కు (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) తగ్గిందని సంస్థ వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగా కారులోని వివిధ భాగాలను ఇండియాలో తయారు చేస్తున్న కారణంగానే ఈ ధర తగ్గింపు సాధ్యమైందని పేర్కొంది. మైక్రో ఆటోమేటిక్ సీవీటీ ఎక్స్ వీ ధర రూ. 7.19 లక్షల నుంచి రూ. 6.73 లక్షలకు తగ్గనుందని సంస్థ భారత ఎండీ అరుణ్ మల్హోత్రా వెల్లడించారు.

  • Loading...

More Telugu News