: కేబీఆర్ పార్కు పేరు మార్చి ముకరంజా పేరు పెట్టండి.. కేసీఆర్‌కు విన‌తి


హైద‌రాబాద్ జూబ్లిహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి(కేబీఆర్) పార్కు పేరును మార్చి ముకరంజా పేరు పెట్టాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్ కోరారు. ఈ విష‌య‌మై ఈరోజు హైద‌రాబాద్‌లో కేసీఆర్‌ని అబీద్ రసూల్‌ఖాన్ క‌లిశారు. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రిన్స్ ముకరంజా నుంచి 300 ఎకరాల స్థలాన్ని అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద తీసుకుంద‌ని ఆయ‌న కేసీఆర్‌తో అన్నారు. ప్రిన్స్ ముకరంజా నుంచి తీసుకున్న భూమిని త‌ర్వాత సీలింగ్‌లో లేద‌ని పేర్కొని, కేబీఆర్ నేష‌నల్ పార్కుగా ప్ర‌క‌టించార‌ని అబీద్ రసూల్‌ఖాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News