: తమిళనాడులో 'ది కంజ్యూరింగ్ 2' హారర్ చిత్రం చూస్తూ తెలుగు వ్యక్తి మృతి


ఇటీవల విడుదలైన హాలీవుడ్ హారర్ మూవీ 'ది కంజ్యూరింగ్-2' చూస్తూ ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువన్నామలైలో గత రాత్రి జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు జీవనోపాధి నిమిత్తం తిరువన్నామలై ప్రాంతంలో ఉంటున్నారు. 'కంజ్యూరింగ్' చిత్రం చూసేందుకు గురువారం రాత్రి సెకండ్ షోకు వెళ్లారు. సినిమా క్లైమాక్స్ సమయంలో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News