: తప్పతాగి ఆరుగురు పోలీసులను కొట్టిన ముంబై యువతి
తప్పతాగిన గౌరీ బిడే (21) అనే యువతి, ముగ్గురు పురుషులతో కలిసి కారులో వస్తూ, డివైడర్ ను ఢీకొట్టడమే కాకుండా, ప్రశ్నించిన ఆరుగురు పురుషులను కొట్టి వీరంగం సృష్టించిన ఘటన ముంబైలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మద్యం మత్తులో ఉన్న గౌరి స్వయంగా కారు నడుపుతూ వచ్చి, నిన్న రాత్రి 1:15 గంటల సమయంలో పొద్దార్ ఆసుపత్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టింది. ఘటనను చూసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు యత్నించగా, నోటి కొచ్చినట్టు తిడుతూ, వారిపై దాడికి దిగింది. ఆరుగురు పోలీసులపై చేయిచేసుకుంది కూడా. అదనపు పోలీసులు వచ్చినా, ఆమెను అదుపు చేయడం కష్టమైంది. చివరకు ఎలాగోలా ఆమెను, కారులోని పురుషులను అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.