: తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు, జగన్‌ల అనుమతి అవసరం లేదు: హరీశ్‌రావు
మల్లన్న సాగర్, గోదావరి ప్రాజెక్టులు కట్టి తీరుతామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. ఈరోజు నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నేతలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ల అనుమతి అవసరం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ ప్రతిపక్ష పార్టీలు మల్లన్న సాగర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు పూర్తి చేసి, రైతులకు కోటి ఎకరాలకు నీరందిస్తామని ఆయన అన్నారు. జీవో 203ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.