: వీవీఐపీలు, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన ఎస్సార్!


ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న ఎస్సార్ గ్రూప్ మరిన్ని చిక్కుల్లో పడింది. 2001 నుంచి 2006 మధ్య అప్పటి ప్రధాని వాజ్ పేయి కార్యాలయం సహా, ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు రాజకీయ నాయకులు, వీవీఐపీల ఫోన్లను ఎస్సార్ గ్రూప్ ట్యాప్ చేసిందని, దీనిపై విచారణ జరపాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు అందింది. గతంలో యూపీఏ ప్రభుత్వం నుంచి ఎస్సార్ గ్రూప్ ఎన్నో వ్యాపార లాభాలను అందుకుందన్న విషయంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సమయంలో ఈ ఫిర్యాదు రావడం విశేషం. ఎస్సార్ గ్రూప్... మంత్రులు ప్రఫుల్ పటేల్, రామ్ నాయక్, సురేష్ ప్రభు, పీయుష్ గోయల్ లతో పాటు వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తదితరుల ఫోన్లనూ ట్యాప్ చేశారని సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ మోదీకి రాసిన లేఖలో ఆరోపించారు. అప్పట్లో ఎస్సార్ గ్రూప్ సెక్యూరిటీ విభాగం హెడ్ గా ఉన్న అల్బాసిత్ ఖాన్ దీనికి కారకుడని ఆరోపించారు. ఎస్సార్ ఉన్నతోద్యోగులు ప్రశాంత్, రవికాంత్ రూయాల ఆదేశాల మేరకు ఖాన్ ట్రాపింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. ఐడీబీఐ బ్యాంకు మాజీ చైర్మన్ పీపీ ఓరా, ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ కేవీ కామత్, జాయింట్ ఎండీ లలితా గుప్తే, అమితాబ్ బచ్చన్, సుబ్రతా రాయ్, జస్వంత్ సింగ్ తదితరుల ఫోన్లూ ట్యాప్ అయ్యాయని, పూర్తి విచారణ జరిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News